ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌

ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌
X

నిజామాబాద్‌ ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఘోరం జరిగింది. హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌రెడ్డి ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే.. హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో.. ప్రకాష్‌రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు ప్రకాష్‌ రెడ్డి కి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. మరో 8 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ప్రకాష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతదేహాన్ని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సిపి కార్తికేయ ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు.

Also watch :

Next Story

RELATED STORIES