Top

చింతమనేని ప్రభాకర్‌కు మరో 14 రోజులు..

చింతమనేని ప్రభాకర్‌కు మరో 14 రోజులు..
X

దెందులూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు మరో 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఇప్పటికే 2017లో దళితునిపై కేసు నేపథ్యంలో ఈ నెల 11 నుంచి చింతమనేని రిమాండ్‌లో ఉన్నారు. అరెస్ట్‌ చేసేందుకు ఇంటికి వెళ్లిన పోలీసులను నిర్బంధించి, దూషించిన కేసులో పోలీసులు చింతమనేనిని ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. పోలీసులపై దూషణ, నిర్బంధం కేసులో వచ్చే నెల 1 వరకు రిమాండ్‌ విధిస్తూ ఏలూరు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చింతమనేనిపై 66 కేసులు నమోదు కాగా, 22 కేసులు దర్యాప్తులో ఉన్నాయి.

Next Story

RELATED STORIES