తాజా వార్తలు

సింగరేణి కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్

సింగరేణి కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్
X

తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిదన్నారు సీఎం కేసీఆర్. సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదన్న కేసీఆర్.. వారికి తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా.. 28 శాతం బోనస్‌ ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ చర్యలతో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగిందని.. సింగరేణిలో ప్రగతి ప్రభుత్వ పాలనాదక్షతకు నిదర్శనమన్నారు.

అప్పులు తీసుకొచ్చినా వాటిని దుర్వినియోగం చేయడం లేదని.. ప్రతిపైసా ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు కేసీఆర్‌. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుమారు 40 నుంచి 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం ఫలాలు అందుతాయన్నారు. మల్లన్నసాగర్‌ నిండితే సింగూరు, నిజంసాగర్‌ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు కేసీఆర్‌.

Also watch :Next Story

RELATED STORIES