కుందూ నదిలో దూకి కుటుంబం ఆత్మహత్య!

X
కడప జిల్లా రాజుపాలెం మండలం గాదెగూడూరులో ఓ కుటుంబం అదృశ్యం స్థానికంగా కలకలంరేపింది. ఈ రోజు తెల్లవారు జాము నుంచి తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు కనిపించడంలేదని పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. తిరుపతిరెడ్డి భార్య వెంకటక్ష్మి, కూతురు ప్రవల్లికలు అదృశ్యమయ్యారని అల్లుడు సుధీర్ కుమార్ రెడ్డి పోలీసులకు కంప్లయింట్ చేశారు.
కూతురు ప్రవల్లిక విషయంలో కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు కుందూ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
