చేతబడి చేశాడన్న అనుమానంతో..

చేతబడి చేశాడన్న అనుమానంతో..
X

చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ యువకుడిని సజీవదహనం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం అద్రాస్‌పల్లిలో జరిగిందీ దారుణమైన ఘటన. గ్రామంలో మహిళ చనిపోవడానికి ఆంజనేయులు అనే యువకుడే కారణమని అనుమానంతో అతన్ని కూడా చంపేశారు. బలవంతంగా ఊరి చివరకు లాక్కెళ్లి.. మహిళ శవంతో పాటు కాల్చేశారు. కాష్టం వద్ద యువకుడికి సంబంధించిన వస్తువుల్ని, ఇతర ఆనవాళ్లను బట్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. క్లూస్‌టీమ్‌ ఆధారాల్ని సేకరిస్తోంది. చేతబడి లాంటి మూఢనమ్మకాలతో యువకుడిని చంపేయడం చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆంజనేయులు కుటుంబ సభ్యులు.. తమ బిడ్డను అకారణంగా చంపేశారంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. లక్ష్మి మరణంతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. పోలీసులు పూర్తి విచారణ చేసి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Also watch :

Tags

Next Story