ఉగ్రవాదులు రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారని ఐబీ వార్నింగ్

ఉగ్రవాదులు రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే స్టేషన్లపై దాడులకు టెర్రరిస్టులు ప్రణాళిక రచించారని వార్నింగ్ ఇచ్చాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను పెంచారు. కీలకమైన రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. స్థానిక పోలీసులు, RPF సిబ్బంది సంయుక్తంగా సోదాలు చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల ను అదుపులోకి తీసుకున్నారు.
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మసూద్, అహ్మద్ పేరుతో రోహ్‌తక్ రైల్వే పోలీసులకు లేఖ వచ్చింది. అక్టోబర్ 8న రైల్వే స్టేషన్లలో దాడులు చేయబోతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. దాంతో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కొన్ని స్టేషన్లలో అదనపు బలగాలను మోహరించారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com