వితంతు కోడలికి మళ్ళీ పెళ్ళి చేసిన..

X
కట్నం కోసం కోడల్ని వేధించే అత్తింటివారు ఉన్న ఈ సమాజంలో.. ఓ మామ తన మంచి మనసును చాటుకున్నాడు. భర్తను పోగొట్టుకొని వితంతువుగా మారిన కోడలికి మళ్లీ పెళ్లి చేసి మనసున్న మారాజుగా నిలిచాడు! ఒడిశాలోని నబరంగ్పుర్ జిల్లా ఎకోరిగావూన్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ గామానికి చెందిన కమల్ లోచన్ మఝీ తన కుమారుడైన లలిత్‌కు 2013లో నైనాతో వివాహం చేశాడు. ఏడాది తర్వాత వారికి ఓ బిడ్డ కూడా పుట్టింది. ఈ క్రమంలో లలిత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నైనాను చూసి చలించిపోయాడు మామ కమల్. తన కోడలికి మళ్ళీ పెళ్ళి చేయాలని నిర్ణయించుకుని రెండెకరాల వ్యవసాయ భూమిని కానుకగా ఇచ్చి ఆమెకు మరో పెళ్లి చేశాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
