బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ సంచలన ఆరోపణలు

బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ సంచలన ఆరోపణలు

35 మంది చనిపోయారు. మరో 12 మంది జాడ లేకుండా పోయారు. తిరిగొస్తారనే నమ్మకం కూడా లేదు. గత ఆదివారం రోజున గోదారిలో బోటు మునిగింది. ప్రస్తుతానికి నదీ గర్భంలో లాంచీ జాడను కనుగొన్నా.. ఎప్పుడు, ఎలా బయటికి తీసుకొస్తారో తెలియదు. బోటు వెలికితీసే ప్రయత్నాలు జరుగుతుండగానే.. అసలు బోటును ఎవరు అనుమతించారనే దానిపై పొలిటికల్ సెగ రాజుకుంటోంది.

5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంలో కూడా రాయల్ వశిష్టకు అనుమతి దక్కటం వెనక పెద్ద హస్తాలే ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్యాటక, నీటి పారుదల, పోలీసు శాఖలకు చెందిన అధికారులు లాంచీ వ్యాపారాల్లోనూ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న వేళ.. మాజీ ఎంపీ హర్షకుమార్ మరో ట్విస్ట్ ఇచ్చారు. మంత్రి అవంతి ఒత్తిడి వల్లే బోటును నదిలోకి అనుమతి ఇచ్చారని అంటున్నారాయన. మందుగా స్థానిక ఎస్సై అడ్డుకున్నా.. మంత్రి జిల్లా పోలీసు అధికారులకు ఫోన్ చేయటంతో బోటును వదిలేశారని అంటున్నారు. అంతేకాదు బోటు 93 మంది ఉన్నారని.. రాయల్ వశిష్ట మునిగిన ప్రాంతాన్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజే గుర్తించినా.. కావాలనే తాత్సరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫ్లోటింగ్ జట్టీ ద్వారా బోటును బయటికి తీసే అవకాశాలు ఉన్నా.. అధికారులకు బోటు వెలికితీయటం ఇష్టం లేదని అన్నారాయన. గోదావరిలో తిరిగే పడవలపై నాయకులు, టూరిజం ఆధికారుల పెట్టుబడులు ఉన్నాయన్నారు.

మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపణలను మంత్రి అవంతి వర్గం కొట్టిపారేసింది. మరోవైపు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా తాము ఎవరిపై ఒత్తిడి చేయలేదని చెబుతోంది. మరోవైపు బోటు ప్రమాదాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు అనుమతి పొందిన బోట్ల సామార్ధ్యాన్ని పరీక్షించాలని ఆదేశించారు. డేంజర్ స్పాట్ లుగా గుర్తించిన నదులు, జలపాతల దగ్గర గత ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. కచ్చులూరు బోటు ఘటన తరహా ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి అవంతి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story