గద్దలకొండ గణేష్.. వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్: మూవీ రివ్యూ

గద్దలకొండ గణేష్.. వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్: మూవీ రివ్యూ
X

ఒక సినిమాకు ఆడియన్స్ ను రప్పించడం అంత సులువు కాదు. కానీ వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్ గా మారిన సినిమాపై ముందు నుంచీ మంచి అంచనాలే పెంచారు. హరీష్ శంకర్ పెన్ పవర్ తో పాటు, ఎల్లువొచ్చి గోదారమ్మ రీమిక్స్ సాంగ్, వరుణ్ తేజ్ మేకోవర్, మిక్కీ జే మేయర్ పాటలు.. ఇవన్నీ విడుదలకు ముందే సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఆ అంచనాలను ఈ గద్దలకొండ గణేష్ అందుకున్నాడా..?

అభిలాష్ అనే ఓ ఔత్సాహిక సినిమా దర్శకుడు తనో రియల్ డాన్ కథనే సినిమాగా తీయాలనుకుంటాడు. అందుకోసం చనిపోయిన వాళ్లు కాకుండా ప్రస్తుతం రౌడీయిజం చేస్తోన్న గద్దలకొండ గణేష్ కథనే సినిమాగా తీయాలనుకుంటాడు. ఇటు గద్దలకొండ గణేష్ చిన్నతనం నుంచి రౌడీయిజం చేస్తూ మంచినీళ్ల ప్రాయంగా మనుషుల్ని చంపేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి కథను తెలుసుకోవాలంటే అక్కడే ఉండి అబ్జర్వ్ చేయాలని గద్దలకొండ ఊరిలో తన ఫ్రెండ్ సాయంతో గణేష్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. అలా గణేష్ ఓ మర్డర్ చేస్తుండగా తన వద్ద టెక్నాలజీతో మొత్తం వింటాడు అభిలాష్. ఆ విషయం తెలుసుకున్న గణేష్ అతన్ని చంపుతానని శపథం చేస్తాడు.

మరి గణేష్ తను చేసిన శపథం నెరవేర్చుకున్నాడా లేక ఈ అభిలాష్ అతని కథను సినిమాగా తీశాడా అనేది మిగతా కథ. హరీష్ శంకర్ చేసిన మార్పులు చేర్పులు మాస్ ను ఉర్రూతలూగిస్తాయి. గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇలాంటి పాత్ర ఫ్యూచర్ లో కూడా మళ్లీ అతను చేస్తాడు అని చెప్పలేం. శ్రీదేవి పాత్రలో పూజాహెగ్డే పాత్ర నిడివి చిన్నది. కానీ ఇంపాక్ట్ పెద్దది. ఎల్లువొచ్చి గోదారమ్మ పాటలో ఈ ఇద్దరూ ఆ ఇద్దరినీ గుర్తుకు తెచ్చారనే చెప్పాలి. దర్శకుడుగా అధర్వ మురళి, అతని లవర్ పాత్రలో మృణాలినీ నేచురల్ గా సెట్ అయ్యారు. అధర్వ బాగా నటించాడు. ఇతర పాత్రల్లో కమెడియన్ సత్య ఫస్ట్ హాఫ్ లో, బ్రహ్మాజీ సెకండ్ హాఫ్ అదరగొట్టారు. లెక్కకు మించిన పాత్రలున్నా.. అందరినీ ఈ గద్దలకొండ గణేష్ డామినేట్ చేశాడనే చెప్పాలి.

టెక్నికల్ గా ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతంలో పాటలు ఇప్పటికే సూపర్బ్ అనిపించుకుంటే సినిమాలోనూ బావున్నాయి. అలాగే అతని నేపథ్య సంగీతం సినిమాకే హైలెట్. సినిమా అంతా ఒకే మూడ్ కంటిన్యూ అయ్యేలా అయానంక బోస్ సినిమాటోగ్రఫీ చాలాబావుంది. హరీష్ శంకర్ టేకింగ్, డైలాగ్స్ కు విజిల్స్ పడతాయంతే. మొత్తంగా తమిళ్ లో హిట్ అయిన జిగర్తాండకు రీమేక్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ మాస్ ను మాత్రం విపరీతంగా మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కాస్త మర్డర్స్ ఎక్కువైనా.. వరుణ్ తేజ్ కు మాస్ హీరోగా నిలబడే సత్తా ఉందని నిరూపించిందీ చిత్రం.

Next Story

RELATED STORIES