ఎంత మంచి వార్త.. ఈ 'ఫ్యాన్' వేస్తే దోమలు పరార్..

ఎంత మంచి వార్త.. ఈ ఫ్యాన్ వేస్తే దోమలు పరార్..

హాయిగా ఆదమరచి నిద్రపోదామంటే అంతలోనే తలుపులన్నీ బిగించి ఉన్నా.. నేనొచ్చేసా అంటూ చెవిలో దోమ గుయ్ మంటూ నిద్ర లేపేస్తుంది. పాడుదోమలు పడుకోనివ్వట్లేదని బ్యాట్ పట్టుకుంటే ఓ పట్టాన దొరక్కుండా నిద్ర చెడగొట్టేస్తుంది. రోజూ ఇదే తంతు. ఒక్కరోజైనా హాయిగా నిద్ర పోవడానికి లేదు. ఏ దోమ కుడితే ఏ జ్వరం వస్తుందో అని అదో భయం. దోమల రిఫెల్లెంట్స్, దోమల బ్యాటులు.. ఆయుధాలు ఎన్ని ఉన్నా దోమలు కుట్టకుండా నిద్రపోవడం అనేది సాధ్యం కాని పని. అయితే ఫ్యాన్ తిరిగితే చాలు దోమలు మీ దరిదాపుల్లోకి రావు.. హాయిగా నిద్రపోవచ్చని అంటున్నారు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ వారు.

ఇండియాలో ఈ స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్‌ని రిలీజ్ చేసింది సంస్థ. దీనికి వైఫై సపోర్టు కూడా ఉంది. డ్యూయెల్ వింగ్ ఫ్యాన్ బ్లేడ్స్ ఉండడంతో గది మొత్తం గాలి వీస్తుందని చెబుతోంది. ఎల్‌ఈడీ డిస్‌ప్లే కూడా ఉన్న ఫ్యాన్ ధర వచ్చి రూ.16,999. అన్నిటికంటే సంతోష పెట్టే వార్త.. ఈ సీలింగ్ ఫ్యాన్‌లో మస్కిటోలను పారద్రోలే టెక్నాలజీ ఉండడం. ఇందులో ఉన్న అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్ టెక్నాలజీతో దోమలు మీ దరిదాపుల్లోకి కూడా రావని అంటున్నారు. మార్కెట్ లో ఇలాంటి ఫ్యాన్లతో పాటు మరికొన్ని ఎలక్ట్రానిక పరికరాలు కూడా దోమలు రాకుండా అడ్డుకట్ట వేయడంలో సక్సెస్ అవుతున్నాయి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story