యువతిపై కొడుకు అఘాయిత్యం.. వీడియో తీసిన తల్లి..

యువతిపై కొడుకు అఘాయిత్యం.. వీడియో తీసిన తల్లి..
X

నువ్వంటే నాకిష్టం.. నువ్వు లేక నేను లేను.. నువ్వే నా ప్రాణం.. అంటూ నాలుగు సినిమా డైలాగులు చెప్పి యువతిని తనవైపు తిప్పుకున్నాడు ఓ నయ వంచకుడు. ఆ యువకుడి తేనె పలుకుల వెనుక ఉన్న దుర్మార్గాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అతడి మాయలో పడి ఆ యువకుడిని గుడ్డిగా నమ్మింది. అదే అదనుగా భావించిన ఆ నీచుడు ఆమెపై అఘాయిత్యం చేశాడు. తన కొడుకు చేసే పాడు పనిని ఖండించాల్సిన తల్లి.. దగ్గరుండి మరీ కొడుకుని ప్రోత్సహించింది. కొడుకు చేస్తున్న దారుణాన్ని వీడియో తీసి.. యువతిని బ్లాక్ మెయిల్ చేసింది తల్లి. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

బలోడా బజార్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా నివసించే ఓ యువతితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. ఆ పరిచయంతోనే ఆమెను ప్రేమలోకి దించాడు. యువతి ఆర్థికంగా కాస్త ఉన్నత కుటుంబానికి చెందినది కావడంతో.. ఆమె దగ్గరనుంచి డబ్బులు కాజేయాలని చూశాడు. తన బుర్రలో తట్టిన నీచమైన ఐడియాను తల్లికి చెప్పి ఒప్పించాడు. తల్లి, కొడుకు కలిసి వారు అనుకున్న ప్లాన్‌ని అమలు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ యువకుడు తన ప్రియురాలిని ఇంటికి తీసుకెళ్లాడు. యువకుడి తల్లి ఆ అమ్మాయిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసింది. ఆమెకు ఇష్టమైన స్నాక్స్ తయారు చేసి పెట్టింది. అందులో మత్తు మందు కలిపానన్న విషయం తల్లికి, కొడుకుకు మాత్రమే తెలుసు. అంతే.. అవి తిన్న కొద్ది సేపటికే యువతి నిద్రలోకి జారుకుంది. మత్తులో ఉన్న యువతిని బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు యువకుడు. ఇక ఆ తల్లి కొడుకును ఎంకరేజ్ చేస్తూ.. ఆ నీచాన్ని వీడియో తీసింది.

తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకున్న బాధితురాలు కన్నీరుమున్నీరైంది. ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత యువతి తండ్రి పొలం అమ్మిన రూ.6లక్షల నగదు కూతురికి ఇచ్చి బీరువాలో పెట్టమన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ తల్లీకొడుకులు ఆమెను డబ్బు కోసం వేధించారు. యువకుడి తల్లి తన దగ్గరున్న వీడియోని యువతికి చూపించి బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో కంగారుపడిన యువతి రూ.4లక్షలు ఇచ్చింది. యువకుడి అక్కాబావకు ఈ విషయం తెలియడంతో వారు కూడా యువతిని డబ్బు కోసం బెదిరించారు.

యువతి తండ్రి బీరువాలో ఉన్న రూ.6లక్షలు తీసుకురమ్మని కూతురిని అడగ్గా.. ఆమె రూ.2లక్షలే ఇచ్చింది. మిగిలిన డబ్బులు ఏమయ్యాయని అతడు అడగడంతో తనకు జరిగిన అఘాయిత్యం గురించి చెప్పి బోరుమంది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ తల్లీకొడుకును అరెస్ట్ చేసి.. విచారిస్తున్నారు.

Also watch :

Next Story

RELATED STORIES