బోటు ప్రమాద ఘటనలో ముగ్గురు అరెస్ట్‌

బోటు ప్రమాద ఘటనలో ముగ్గురు అరెస్ట్‌
X

గోదావరి నది బోటు ప్రమాద ఘటనలో ముగ్గురుని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణతో పాటు అదే కుటుంబానికి చెందిని మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. డ్రైవర్‌ అనుభవ రాహిత్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు..

ఎడమవైపు వెళ్లాల్సిన బోటును గోదావరి మద్యలోంచి తీసుకెళ్లారని వివరించారు. బోటులో మొత్తం ముగ్గురు పిల్లలు, 64 మంది పెద్దవాళ్లు ఉన్నారని.. స్టాఫ్‌తో కలిసి మొత్తం బోటులో 75 మంది ఉన్నారని ఎస్పీ అన్నారు.. ఇప్పటికే బోటు యజమానికిపై పలు కేసులు నమోదు చేశామని ఆయన చెప్పారు.

Also watch :

Tags

Next Story