అమెరికాలో మరోసారి కాల్పులు.. వైట్‌హౌస్‌కు మూడు కి.మీ. దూరంలో ..

అమెరికాలో మరోసారి కాల్పులు.. వైట్‌హౌస్‌కు మూడు కి.మీ. దూరంలో ..
X

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్‌ డీసీలోని ఓ వీధిలో ఆగంతకుడు జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

కాల్పుల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాల్పుల్లో ఉగ్రవాద కోణంపై ఆరా తీస్తున్నారు. సమీప వీధులను ఖాళీ చేయించి దుండగుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో కాల్పులు స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి.

అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైట్‌ హౌస్‌ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

Also Watch :

Tags

Next Story