యువతి చేసిన ఆ చిన్న పొరపాటు..

యువతి చేసిన ఆ చిన్న పొరపాటు..
X

యువతి చేసిన ఓ చిన్న పొరపాటు తన ఇంటినే తగలబెట్టేసింది. తన మాజీ లవర్ రాసిన లవ్ లెటర్‌ను బూడిద చేయాలని తన గూడునే నేలమట్టం చేసుకుంది యువతి. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

బెబ్రస్కాలో నివసిస్తున్న ఓ యువతికి తన బెడ్ రూమ్‌లో కొన్ని లెటర్స్ కనిపించాయి. ఆ లెటర్స్ చూసిన యువతికి.. ఏదో తెలియని టెన్షన్ మొదలైంది. ఆ లెటర్స్ తన మాజీ లవర్ రాసినవి కావడంతో.. తనలో అణుచుకున్న కోపం కట్టలుతెంచుకుని బయటకు వచ్చింది. దీంతో ఆ లవ్ లెటర్స్‌కు నిప్పు అంటించింది. ఇక ఆ తర్వాత బెడ్ మీద రిలాక్స్‌గా పడుకుంది.

అయితే ఆమె అంటించిన లవ్ లెటర్స్ కొన్ని నేలపై ఉన్న కార్పెట్‌కు అంటుకున్నాయి. అవి క్రమేణా ఇల్లు మొత్తం వ్యాపించాయి. దీంతో ఆమె నిద్ర నుంచి లేచి బయటకు పరుగులు తీసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

Also watch :

Next Story

RELATED STORIES