పెళ్లి ఆలస్యం చేస్తున్నారని ఓ ప్రేమ జంట..

పెళ్లి ఆలస్యం చేస్తున్నారని ఓ ప్రేమ జంట..
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లిచేయకుండా జాప్యం చేస్తూ.. తమను విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్నారపాడు గ్రామానికి చెందిన గోపీచంద్‌, సింధు ఇద్దరు గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ గురించి ఇరు కుటుంబాలకు తెలిసింది. మొదట్లో వద్దని వారించినా.. తర్వాత వారి పట్టుదలతో పెళ్లికి అంగీకరించారు. అయితే కొంత సమయం ఇవ్వాలని పెద్దలు కోరారు. అయితే తమ పెళ్లి ఇష్టం లేకనే అలా ఆలస్యం చేస్తున్నారని భావించిన ప్రేమికులు శుక్రవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also watch :

Next Story

RELATED STORIES