సుహాసినికి భర్తగా.. ఓ చిత్రంలో శివప్రసాద్

సుహాసినికి భర్తగా.. ఓ చిత్రంలో శివప్రసాద్
X

మొదట తాను పెళ్లి చేసుకున్నా.. భార్య మనసు తెలుసుకుని తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపిస్తాడు. ఇది కొత్త జీవితం చిత్రం లో భారతీ రాజా శివప్రసాద్‌కు ఇచ్చిన పాత్ర. ఓసారి దర్శకుడు భారతీరాజా శివప్రసాద్ చదివే కాలేజీకి చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. దర్శకుడిని కలిసి తనకీ సినిమాల్లో ఏదైనా వేషం ఇప్పించమని శివప్రసాద్ అడిగే సరికి.. ఆయనకు నాటకాల్లో ఉన్న అనుభవం.. సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి.. కాదనలేక సుహాసినికి భర్తగా నటించే పాత్ర ఇచ్చారు ఆ చిత్రంలో. సినిమాల్లో అవకాశం రావడమే గొప్ప అందుకే ఆ చిత్రానికి పారితోషికం తీసుకోలేదని చెబుతుంటారు ఆయన. ఆ తరువాత ఖైదీ, పోరాటం, బొబ్బిలి బ్రహ్మన్న, రారాజు, ఈ దేశంలో ఒక రోజు, ఇది కాదు ముగింపు.. తదితర చిత్రాల్లో నటించారు. ప్రొఫెషనల్ ఆర్టిస్టుని కాను.. సినిమాలపై ఉన్న ఇష్టంతో నటించే వాడిని అని అంటుండేవారు శివప్రసాద్. రాజీకీయాల్లో బిజీగా ఉన్నా ఖాళీగా ఉన్నప్పుడు.. ఏదైనా సినిమాకు డేట్స్ ఇచ్చుంటే బాగుండేదని అనుకుండేవారట. ఆ ఇష్టంతోనే చాలా సినిమాలకు పారితోషికం తీసుకోకుండా నటించేవాడినని చెప్పుకొచ్చేవారు పలు సందర్భాల్లో.

Next Story

RELATED STORIES