Top

'నమో' మెనూ ఇదే.. వంట చేసేది ఎవరో తెలుసా?

నమో మెనూ ఇదే.. వంట చేసేది ఎవరో తెలుసా?
X

వారం రోజుల పాటు అమెరికాలో పర్యటనలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం అక్కడ ప్రత్యేక మెనూ రెడీ అయింది. హోస్టన్‌ కు చెందిన ప్రముఖ చెఫ్‌ కిరణ్‌ వర్మ ప్రధాని కోసం ప్రత్యేకంగా తయారుచేసిన నమో తాలి సేవ్రి, నమో తాలి మిఠాయి పసందైన వంటకాలను వడ్డించనున్నారు. మోదీ కోసం ఈ వంటకాలన్నీ స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ప్రధాని మెనూలో పలు రకాల పచ్చళ‍్లను పొందుపరిచారు. మోదీ కోసం నమో తాలి మిఠాయిలో గజర్‌ కా హల్వా, బాదం హల్వా, రస్‌మలై, ష్రికండ్‌లు ఉండగా, నమో తాలి సేవ్రిలో కిచిడీ, కచోరీ, మేతి తెప్లా వంటకాలున్నాయి. అలాగే అమెరికాలో ప్రాచుర్యం పొందిన పసందైన వంటకాలను ప్రధాని కోసం సిద్ధం చేసినట్టు చెఫ్‌ కిరణ్‌ పేర్కొన్నారు. ఈ సందర్బంగా భారత ప్రధానికి వంట చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. తాను చేసే ప్రతి వంటకం మోదికి నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Also watch :

Next Story

RELATED STORIES