తాజా వార్తలు

జీతాలు పెంచాలంటూ సెల్ టవర్ ఎక్కి..

జీతాలు పెంచాలంటూ సెల్ టవర్ ఎక్కి..
X

హైదరాబాద్‌కి కృష్ణా నీటిని ఆపేశారు HMWS కార్మికులు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలోని మాల్ గ్రామం సమీపంలోని గోడకొండ్ల వద్ద వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో 3 మోటార్లు నిలిపేశారు. తమ వేతనాలు పెంచాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నారు.

18 గంటలుగా వీరి ఆందోళన కొనసాగుతుండడంతో.. బుజ్జగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. జీతాలు పెంచడంతోపాటు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని కార్మికులు శనివారం రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. కొందరు ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఆవరణలో ఆందోళనకు దిగగా.. కొందరు టవర్ ఎక్కారు. వర్కర్ల ఆందోళన నేపథ్యంలో.. అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also watch :

Next Story

RELATED STORIES