శ్రీకళరెడ్డి పేరును పరిశీలిస్తున్న తెలంగాణ బీజేపీ

శ్రీకళరెడ్డి పేరును పరిశీలిస్తున్న తెలంగాణ బీజేపీ

కాంగ్రెస్‌కు కంచుకోట అయిన హుజూర్‌నగర్‌లో ఈసారి తమ బలమేంటో చూపించాలని బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.. పార్లమెంటు ఎన్నికల తర్వాత వరుస చేరికలతో బలం పెంచుకుంటున్న బీజేపీ.. ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించేందుకు పక్కా వ్యూహాలతో వారు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఉత్తమ్‌కు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన రామ్‌రెడ్డిని తమవైపు తిప్పుకున్నారు. దీని ద్వారా హుజూర్‌నగర్‌లో తమ నెట్‌వర్క్‌ మరింత పెరిగినట్టుగా బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. గెలుపు గుర్రానికే టికెట్‌ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. గత ఎన్నికలలో పోటీచేసి ఓడిన బోబ్బా భాగ్యరెడ్డితోపాటు కోటా రామారావు, ఎన్‌ఆర్‌ఐ అప్పిరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. ఇటీవలే అప్పిరెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిశారు. అయితే, అధికారికంగా బీజేపీలో చేరలేదు. అప్పిరెడ్డి బీజేపీలోకి వస్తే ఆయన్ను బరిలో దించేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల పార్టీ తీర్థం పుచ్చుకున్న శ్రీకళరెడ్డి పేరును కూడా అధిష్ఠానం సీరియస్‌గా పరిశీలిస్తోంది. మొత్తంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను చూశాక.. తమ అభ్యర్థిని ప్రకటించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story