మారని పాక్ బుద్ధి.. 500 మంది టెర్రరిస్టులకు..

X
TV5 Telugu23 Sep 2019 2:13 PM GMT
ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా పాకిస్థాన్ బుద్ది మారడం లేదు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపడం లేదు. తాజాగా బాలాకోట్‌లో మళ్లీ ఉగ్రవాద శిబిరాన్ని ప్రారంభించారు. దాదాపు 500 మంది టెర్రరిస్టులకు బాలాకోట్‌లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ముష్కరమూకలను ప్రేరేపించి మనదేశంలో విధ్వంసం సృష్టించాలన్నది పాక్ పన్నాగం.
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాన్ని మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజర్ నడుపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే మసూద్ అజర్‌ను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రహస్యంగా విడుదల చేసింది. అతన్ని ముందుగా భావల్పూర్‌కు పంపినప్పటికీ, ఆ తర్వాత బాలాకోట్‌కు వచ్చినట్లు సమాచారం. మసూద్ అజర్ కనుసన్నల్లోనే ఉగ్రవాదులకు శిక్షణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Also watch :
Next Story