మోదీ సర్కారు మరో సంచలన నిర్ణయం?

మోదీ సర్కారు మరో సంచలన నిర్ణయం?

మోదీ సర్కారు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఒకే దేశం-ఒకే పన్ను, ఒకే దేశం-ఒకే రాజ్యాంగం అనే మంత్రాన్ని పఠిస్తున్న మోదీ ప్రభుత్వం, ఇప్పుడు ఒకే దేశం-ఒకే కార్డు నినాదానికి తెరపైకి తెచ్చింది. వివిధ రకాల అవసరాల కోసం మల్టీపర్పస్ కార్డును తీసుకురావాల్సిన అవసరముందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అన్ని రకాల కార్డుల స్థానంలో సింగిల్ కార్డును రూపొందిస్తామని ఎన్డీఏ సర్కారు తెలిపింది. అన్ని అవసరాలకు ఉపయోగపడేలా దేశమం తా ఓకే గుర్తింపు కార్డు తీసుకువస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. బహుళ ప్రయోజన కార్డును తీసుకురావడం సాధ్యమే అన్నారు.

రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సెస్ కమిషనర్ నూతన ప్రధాన కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్టీ పర్పస్ కార్డు, జనాభా లెక్కలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2021లో జనగణనను మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తామని అమిత్ షా పేర్కొన్నారు. పేపర్ జనగణన నుంచి డిజిటల్ జనగణన దశకు మారుతున్నామని చెప్పారు. 2021నాటి జనాభా లెక్కలకు 12 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు.

దేశంలో ప్రస్తుతం రకరకాల కార్డులున్నాయి. ఆధార్, పాన్, ఓటర్, రేషన్, డ్రైవింగ్ ఇలా డజన్ల సంఖ్యలో కార్డులున్నాయి. వీటన్నింటిని ఉమ్మడిగా ఉపయోగించుకునేలా మల్టీ పర్పస్ కార్డు రూపొందించాలని మోదీ సర్కారు భావిస్తోంది. అలాగే, జనాభా లెక్కల ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. జాతీయ జనాభా జాబితా ద్వారా శాంతి భద్రతల పర్యవేక్షణ మెరుగవుతుందని, నేరాల నియంత్రణ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ సులువుగా మారు తుందని కేంద్రం చెబుతోంది. ఒక వ్యక్తి చనిపోతే ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యే వ్యవస్థను తీసుకువస్తామని కేంద్రం పేర్కొంది.

Also watch:

Tags

Read MoreRead Less
Next Story