తప్పిన పెను ప్రమాదం.. కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

తప్పిన పెను ప్రమాదం.. కశ్మీర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం
X

పెను ప్రమాదం తప్పింది. ఉగ్ర కుట్న భగ్నమైంది. జమ్మూ కశ్మీర్‌లో మారణహోమం సృష్టించడానికి ఉగ్రవాదుల పన్నిన కుట్రను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. కథువా ప్రాంతంలోని దెవాల్‌ గ్రామం లో 40 కిలోల పేలుడు పదార్థాలను సైనిక దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

కశ్మీర్‌ లోయలో సైన్యంపై విరుచుకుపడడానికి ఉగ్రవాదులు ప్రణాళిక రచిస్తున్నాయని కొన్ని రోజులుగా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల ఐబీ నుంచి సైన్యానికి మరోసారి విశ్వసనీయమైన సమాచారం అందింది. దాంతో సైనిక బలగాలు, కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అనుమానిత ప్రాంతంలో గాలింపు జరిపారు. ఈ సోదాల్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు దేశీయంగా తయారు చేసినవేనని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

Also watch :

Next Story

RELATED STORIES