ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఇంకోలెక్క..

ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఇంకోలెక్క..

ఎనర్జీ సిటీ హ్యూస్టన్‌కే డబుల్ డోస్‌ ఎనర్జీ నింపారు మోదీ-ట్రంప్‌. ఇద్దరు నేతల పరస్పర ప్రశంసలతో స్టేడియం మార్మోగిపోయింది. ఎన్ఆర్జీ స్టేడియం‌ ఊగిపోయింది. మునుపెన్నడూ ఏ దేశాధినేతను పొగడని రేంజ్‌ లో మోదీ...ట్రంప్‌ పాలనను కీర్తించారు. ట్రంప్‌ కూడా మోదీ రేంజ్‌ కు తగ్గకుండా అతని సామర్థ్యాన్ని ప్రశంసించారు.

మోదీ నినాదాలతో మార్మోగిపోయిన స్టేడియంలో గుడ్‌ మార్నింగ్‌ హ్యూస్టన్‌ అంటూ ప్రసంగం ప్రారంభించిన మోదీ..ఆ తర్వాత అంతా ట్రంప్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచానికి ట్రంప్‌ గురించి పరిచయం చేయాల్సిన పని లేదంటూనే సభకు ఘనంగా ఇంట్రడ్యూస్‌ చేశారు. ఆమెరికా ఆర్ధిక వ్యవస్థను మరోసారి పటిష్టం చేసిన అధ్యక్షుడు ట్రంప్‌ అంటూ ప్రశంసించారు మోదీ. ప్రపంచంలోనే ట్రంప్‌ ఎంత శక్తివంతుడో తెలుసన్న మోదీ..ప్రపంచంలోనే ప్రతి 10 చర్చల్లో ట్రంప్ ఉంటారని అన్నారు.

ట్రంప్‌ సభకు ఇంట్రడ్యూస్‌ చేసిన మోదీ..ఆ తర్వాత ట్రంప్‌ దగ్గరికి వెళ్లి పోడియం దగ్గరకు తొడ్కోని వచ్చారు. మైక్‌ అప్పగించి తాను కిందకు వెళ్లి కూర్చున్నారు. ఇక ఈ సారి ప్రశంసల పర్వం ట్రంప్‌ వంతు అయ్యింది. మోదీ సమర్థతను, నాయకత్వ పటిమను, మోదీ నాయకత్వంలో భారత్‌ బలపడుతున్న తీరును పదే పదే ప్రశంసించారు ట్రంప్‌.

వాణిజ్య సంబంధాల్లో అత్యంత ప్రధాన్యత కలిగిన దేశాల జాబితా నుంచి భారత్‌ ను తొలగించిన ఆమెరికా...హ్యూస్టన్‌ వేదికగా కొత్త బంధాన్ని సాక్షాత్కరించింది. ఇన్నాళ్లు ఒక తీరు..ఇక నుంచి ఒక తీరు అంటూ భారత్‌ - ఆమెరికా మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు హ్యూస్టన్‌ నుంచి కొత్త స్నేహగీతం కొనసాగుతుందని అన్నారు మోదీ. వైట్‌ హౌజ్‌ లో ఉన్న నిజమైన స్నేహితుడు ట్రంప్‌ అని అన్నారు మోదీ. దీపావళి సంబరాల్లో ట్రంప్‌ మరోసారి అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు.

ఆమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల ప్రొద్భలం తీసివేయలేమని అన్నారు ట్రంప్. రెండు దేశాల మధ్య సారూప్యతలను వివరించిన ట్రంప్‌ భారత్‌ అత్యున్నత విలువలు, సంస్కృతి ఆమెరికాతో కలిసిపోతాయన్నారు. గతంలో ఎప్పుడు లేనంతగా ఆమెరికాలో భారత్‌ పెట్టుబడులు పెరిగాయన్నారు. అంతేకాదు భారత ఇంధన అవసరాలకు ఆమెరికా తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు ట్రంప్‌. భారత్‌-అమెరికా రక్షణ ఉత్పత్తుల భాగస్వామ్య దేశాలుగా మారుతున్నాయని అన్నారు.

సాధారణంగా ఆమెరాకి అధ్యక్షుడి విదేశీ పర్యటనకు పెద్ద తతంగమే ఉంటుంది. పిలిచినా ఆహ్వానాన్ని మన్నించలేని సందర్భాలు కూడా ఉంటాయి. అయితే..హ్యూస్టన్‌ లో ఆద్యంతం స్నేహగీతం ఆలపించిన ట్రంప్‌..తాను వచ్చే నెలలో ఇండియా వస్తానని అన్నాడు. ముంబైలో జరిగే స్పోర్ట్స్‌ ఈవెంట్ కు తాను రావొచ్చని అన్నారు. దీనికి బదులుగా ప్రాధాని మోదీ వెంటనే మోదీని ఇండియాకు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నో సార్లు ఇరు దేశాల మైత్రిపై స్పీచులు ఇచ్చినా..హ్యూస్టన్‌ ప్రసంగానికి ఉన్న ప్రత్యేకత వేరు. భారత్‌- అమెరికా ఒకరి కోసం ఒకరు అనేంతగా పరస్పరం స్నేహాన్ని చాటుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story