క్షమించండి.. మీ వారు నాతోనే ఉన్నారు

క్షమించండి.. మీ వారు నాతోనే ఉన్నారు
X

'ఉమ్మడి స్వప్నం.. ఉజ్వల భవిత' పేరుతో టెక్సాస్‌లో ఇండియా ఫోరం నిర్వహించిన 'హౌడీ మోదీ' కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో భాగంగా మోదీ కేవలం ట్రంప్‌తో మాత్రమే కాకుండా ఇతర అమెరికా నాయలతోనూ ఉల్లాసంగా గడిపారు. ఇదే సమయంలో యూఎస్ సెనెటర్ జాన్ కార్సిన్‌తో సరదాగా సంభాషిస్తున్న మోదీ సెనెటర్ భార్యకు క్షమాపణలు చెప్పారు. ఆదివారం కార్సిన్ భార్య పుట్టిన రోజు. ఈ రోజు మీకెంతో ముఖ్యమైన రోజని నాకు తెలుసు.. అయినా మీ భర్త మీతో లేకుండా నాతో ఉండాల్సి వచ్చింది. ఇది మీకు కోపాన్ని కలిగించవచ్చు.. అందుకు నన్ను క్షమించండి.. అని అన్నారు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలంటూ ఆమెకు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు మోదీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Next Story

RELATED STORIES