నలుగురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

నలుగురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
X

కర్నూలు జిల్లా డోన్‌ తారకరామనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కుంటుబ కలహాలతో వరలక్ష్మి అనే మహిళ తన నలుగురు పిల్లలకు విషం ఇచ్చి.. తరువాత తాను కూడా తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈరన్నతో 14 ఏళ్ల కిందట వరలక్ష్మికి వివాహం జరిగింది. వీరికి నలుగురు సంతానం ఉన్నారు. అయితే కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

సోమవారం ఉదయం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు స్థానికులు చెపుతున్నారు. భర్తతో గొడవల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురైన వరలక్ష్మి పిల్లలకు ఇచ్చిన పాలు, టీలో పురుగుల మందు కలిపి తాగించింది. తరువాత ఆమె కూడా ఆ టీ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని గుర్తించిన స్థానికులు వరలక్ష్మితో పాటు, పిల్లలను కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేలోపే వరలక్ష్మి మృతి చెందగా.. పిల్లల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పరారీలో ఉన్న భర్త ఈరన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Next Story

RELATED STORIES