తీహార్‌ జైల్‌కి సోనియా, మన్మోహన్

తీహార్‌ జైల్‌కి సోనియా, మన్మోహన్
X

ప్రస్తుతం ఈడీ కేసులో భాగంగా రిమాండులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కలిసేందుకు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీహార్ జైలుకు చేరుకున్నారు. సోనియా, మన్మోహన్ తో పాటు చిదంబరం తనయుడు కార్తీ కూడా వారితో కలిసివచ్చారు. సెప్టెంబర్ 5 నుంచి తీహార్ జైల్లో రిమాండు ఖైదీగా చిదంబరం ఉన్నారు. INX మీడియా కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ చిదంబరాన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించింది.

ప్రస్తుతం రిమాండులో ఉన్న చిదంబరం తరపున గడిచిన మూడు వారాలుగా బెయిలు కోసం లాయర్లు విసృత ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కోర్టులో ఆయనకు ఊరట లభించడం లేదు. కేసులో సాక్ష్యాధారాలు ఆయనకు వ్యతిరేకంగా బలంగా ఉండడంతో బెయిలు ఇచ్చేందుకు కోర్టు అనుమతించడం లేదు.

Also watch :

Next Story

RELATED STORIES