సుడిగాలి సుధీర్‌తో శివప్రసాద్ చివరిసారిగా..

ఇటీవల కన్నుమూసిన చిత్తూరు మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌కు నటన అంటే ఎంత ఆసక్తో తెలిసిందే. నటనపై ఆసక్తి కారణంగా డాక్టర్ వృత్తిలో బిజీగా ఉన్న సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించకపోయినా నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. రాజకీయాల్లో కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకుగాను శివప్రసాద్ తనదైన శైలిలో నటనానుభవాన్ని జోడించి రోజుకో వేషంతో కేంద్రంపై నిరసన వ్యక్తం చేసేవారు. పారితోషికం కోసం కాకుండా తనకున్న ప్యాషన్‌తోనే చాలా సినిమాల్లో ఫ్రీగా నటించేవారు శిప్రసాద్. ఆయన నటించిన చివరి సినిమా.. జబర్దస్త్త్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న చిత్రంలో శివప్రసాద్ మంత్రిగా నటించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కె. శేఖర్ రాజు తెలిపారు. ఆయన తమ చిత్రంలో మంత్రిగా ఒక ప్రత్యేక పాత్రలో నటించారని అన్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. సాప్ట్‌వేర్ సుధీర్ చిత్రం ద్వారా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com