తాజా వార్తలు

నర్సు చేసిన తప్పిదానికి పసికందు మృతి

నర్సు చేసిన తప్పిదానికి పసికందు మృతి
X

జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. డాక్టర్లు లేక పోవడంతో ఓ నర్సు తానే స్వయంగా డెలివరీ చేసింది. ఆ తర్వాత శిశువు మరణించడంతో బంధువులు ఆందోళనకు దిగారు.

పాలకుర్తి మండలంలో ఈరెంటి గ్రామానికి చెందిన పురుషోత్తం, రమాదేవిల కూతురికి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. నిన్న సాయంత్రం డాక్టర్లు ఎవరూ లేకపోవడంతో స్టాఫ్‌ నర్స్‌ ఆపరేషన్‌ చేసింది. ఈ ఘటనలో పసికందు చనిపోయింది.

నర్సు నిర్లక్ష్యం వల్లే తమ శిశువు చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story

RELATED STORIES