తాజా వార్తలు

విడాకులు తీసుకుని మద్యానికి బానిసై..

విడాకులు తీసుకుని మద్యానికి బానిసై..
X

ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు మోసం చేశాడు. దాంతో అతడి నుంచి విడిపోయింది.. విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైంది. అయిన వారు లేరు.. ఆదరించే వారు లేరు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇలా ఆలోచిస్తూనే రైలెక్కింది. గమ్యస్థానం తెలియకుండా రోజూ రైల్లో ప్రయాణం చేస్తుంటుంది. ఊహించని పరిణామం ఎదురవుతుంది ఓ రోజు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అదే 'ది గర్ల్ ఆన్ ది ట్రైన్'. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ పరిణితి చోప్రా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలా రూపొందించింది చిత్ర యూనిట్. పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ముఖం మీద గాయాలతో బాత్‌టబ్‌లో కూర్చొని ఉన్న పరిణితి లుక్ ఆకట్టుకుంటోంది. రిబు దాస్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

View this post on Instagram

#TheGirlOnTheTrain 💕

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

Next Story

RELATED STORIES