వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు తగినశాస్తి చేసిన భార్య

మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యాపిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్న భర్తకు ఓ భార్య తగినశాస్తి చేసింది. సాటి మహిళల సహకారంతో అతనికి బడితే పూజ చేసింది. ఈ ఘటన వరంగల్ పట్టణంలోని శివనగర్‌లో మంగళవారం ఉదయం జరిగింది. శివనగర్ కు చెందిన ముత్తోజు రవి మూడేళ్లుగా భార్యాపిల్లలకు దూరంగా ఉంటూ మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. భార్య సరిత, బంధువులు ఎంత చెప్పినా వినకుండా ఆ మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
దాంతో భర్తకు బుద్ధి చెప్పాలనుకున్న భార్య.. అందులో భాగంగా స్థానిక మహిళలతో కలిసి పధకం వేసింది. మంగళవారం రవి తన ప్రియురాలితో ఏకాంతంగా ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితక్కొటింది. ఆమెతోపాటు తోటి మహిళలు కూడా రవి, సదరు మహిళపై చెయ్యేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. రవి, అతని ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com