మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించిన కేంద్రం

మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురిపించిన కేంద్రం
X

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌ బచ్చన్‌.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. బిగ్‌ బీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సినీరంగంలో చేసిన విశేష సేవలకు గాను అమితాబ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించామని తెలిపింది. రెండు తరాల ప్రేక్షకులను బిగ్ బీ అట్రాక్ట్ చేసి, స్ఫూర్తిగా నిలిచారని కేంద్రం కొనియాడింది. అమితాబ్‌ను చూసి యావత్ దేశంతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా గర్విస్తోందని ప్రశంసించింది. బిగ్ బీ సేవలను కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రస్తావించారు. ట్విట్టర్ ద్వారా అభినందించారు.

భారతదేశం గర్వించదగిన నటుల్లో అమితాబ్ ఒకరు. 5 దశాబ్దాల నట జీవితంలో మెగాస్టార్ అమితాబ్ 190కి పైగా సినిమాల్లో నటించారు. సాంఘిక, చారిత్రక చిత్రాల్లో తనదైన నటనతో చెరిగిపోని ముద్ర వేశారాయన. యాంగ్రీ హీరోగా, రెబల్‌గా, లవర్ బాయ్‌గా రకరకాల పాత్రల్లో అలరించారు. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్‌తో బుల్లితెర ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు.

Also watch :

Next Story

RELATED STORIES