భారీ భూకంపం.. 20 మంది మృతి..

భారీ భూకంపం.. 20 మంది మృతి..

భారీ భూకంపం పాకిస్థాన్‌ను వణికించింది. తీవ్ర భూకంపం ధాటికి 20 మంది మరణించారు. వందమందికి పై గా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నా రులు, ఒక మహిళ ఉంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్తినష్టం కూడా భారీగానే ఉంటుందని సమాచారం. పీఓకేలోని మీర్పూర్‌ ప్రాంతంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతను 6.3గా నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రత 5.8గా నమోదు కాగా, మీర్పూర్ సమీప ప్రాంతాల్లో 7.1గా రికార్డైంది.

ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, పెషావర్, ఖైబర్ పంఖ్తుక్వా ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. 8 నుంచి 10 సెకన్ల పాటు భూమి కంపించింది. స్కర్ద్, కోహట్, ఫైజాబాద్, అబ్బోటాబాద్, ముల్తాన్, షాంగ్లాల్లో కూడా భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.

రావల్పిండి పరిసర ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. మీర్పూర్‌లో పలు చోట్ల రోడ్లు ధ్వంస మయ్యాయి. రహదారులపై భారీగా పగుళ్లు ఏర్పడ్డాయి. పీఓకేలో ఇళ్లు కూలిపోయాయి. భవంతులు దెబ్బ తిన్నాయి. రోడ్లు చీలిపోవడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. కొన్ని వాహనాలు తిరగబడ్డాయి. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పాక్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. బాధితులను ఆదుకోవడానికి పాక్ సైన్యం రంగంలోకి దిగింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. భూకంపం నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు.

అటు ఉత్తర భారతంలోనూ భూకంపనలు చోటు చేసుకున్నాయి.. దేశ రాజధాని ఢిల్లీతో పాటు నార్త్ ఇండియా రాష్ట్రాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. కశ్మీర్‌, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌ లో భూ ప్రకంపనలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్ర త 6.3గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో వణికిపోయారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు.

Tags

Read MoreRead Less
Next Story