సైరా సందడి మొదలయ్యింది.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ..

మెగా హీరో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సైరా చిత్రం మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను సైరాగా మలిచాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అక్టోబర్ 1న ఈ చిత్రం అమెరికాలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం థియేటర్ల జాబితాను షేర్ చేసింది.
ఇంకా ఈ చిత్రం ప్రీమియర్ షోకు కొన్ని ఆఫర్లు కూడా ప్రకటించింది. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ అని తెలిపింది. ఈ చిత్రాన్ని అమెరికాలో స్నోప్లేక్ సినిమా, వీకెండ్ సినిమా యూఎస్, బిగ్ థింక్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. సెన్సార్ బోర్డు సైరాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు సభ్యుల ప్రశంలందుకుంది సైరా. చిత్ర కథ వారిని అమితంగా ఆకట్టుకోవడంతో సింగిల్ కట్ కూడా లేకుండా ఓకే చేసారు బోర్డు సభ్యులు. ఈ చిత్రంలో అమితాబ్, నయనతార, తమన్నా కీలక పాత్రలు పోషించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com