వేణుమాధవ్‌ను హీరోను చేసింది ఆయనే..

వేణుమాధవ్‌ను హీరోను చేసింది ఆయనే..
X

ఓ రకంగా వేణుమాధవ్‌కు అవకాశం ఇచ్చింది కృష్ణారెడ్డి అయినా.. కమెడియన్ గా నిలబడటం వెనక వేణు స్వయంకృషి చాలా ఉంది. తనను నిలబెట్టుకునే ప్రయత్నంలో వచ్చిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపించాడు. సీనియర్ కమెడయన్స్ కూడా ఎంకరేజ్ చేయడంతో.. చాలా తక్కువ టైమ్ లోనే వేణు కోసం ట్రాక్ లు రాసుకున్నారు దర్శక రచయితలు. దీంతో ఏమంత ఆలస్యం కాకుండానే అగ్ర హీరోల సినిమాల్లోనూ అత్యధిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు వచ్చాడు.

మామూలుగా చాలామంది కమెడియన్స్ కు సినిమా విజయాలను బట్టి అవకాశాలు వస్తాయి. కానీ వేణు టైమ్ లో ఆ గొడవ లేకుండా నిలబడింది కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే. సినిమా ఏదైనా వీరి సీన్స్ సూపర్ హిట్ అయిపోయేవన్నమాట. అలాగే సీనియర్స్ తో లేదా తోటి కమెడియన్స్ కాంబినేషన్ సీన్స్ లోనూ వేణు చెలరేగిపోయేవాడు. ఏ క్యారెక్టర్ చేసినా అతన్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించేది. ముఖ్యంగా లక్ష్మి సినిమాలో తెలంగాణ శకుంతల కాంబినేషన్ లో సీన్స్ అతని ప్రతిభకు పరాకాష్ట.

నటుడుగా జన్మనిచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి వేణును హీరోగానూ చేశాడు. ఆల్రెడీ తను హీరోగా చేసిన అలీతో కలిపి హంగామా సినిమాలో వేణుమాధవ్ ను హీరోగా చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత భూ కైలాష్ అనే సినిమాలో సోలో హీరోగా ఆకట్టుకున్నాడు. సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. అతను మాత్రం నిర్మాతగా మారి ప్రేమాభిషేకం చిత్రాన్ని నిర్మించి హీరోగా నటించాడు. బట్ ఈ మూవీ ఫ్లాప్ కావడంతో మళ్లీ నిర్మాణం వైపు వెళ్లలేదు.

Also watch :

Next Story

RELATED STORIES