వేణుమాధవ్ ఓవర్ నైట్ స్టార్ అయింది ఆ మూవీతోనే..

వేణుమాధవ్ ఓవర్ నైట్ స్టార్ అయింది ఆ మూవీతోనే..
X

తొలిప్రేమ సినిమాతో వేణుమాధవ్ ఓవర్ నైట్ బిజీ అయిపోయాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ లో ఓ స్టూడెంట్ గానో లేదంటే ఏదైనా రౌడీ గ్యాంగ్ లో మెంబర్ గానో హల్‌చల్ చేయడం మొదలుపెట్టాడు. అయితే ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్ గానే సందడి చేశాడు.

వేణుమాధవ్ వచ్చిన టైమ్ లో పరిశ్రమకు కొత్త కమెడియన్స్ చాలామంది వచ్చారు. అయినా అందర్లోనూ తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా వేణు మిమిక్రీ ఆర్టిస్ట్ కావడంతో డైలాగ్స్ ను అలా చెప్పేవాడు. అలాగే మంచి ఎక్స్ ప్రెషన్స్ కూడా కలిసొచ్చాయి. దీంతో తక్కువ టైమ్ లోనే యంగ్ హీరోల సినిమాల్లో కాలేజ్ స్టూడెంట్ పాత్రలతో ఆకట్టుకున్నాడు. పైగా అప్పుడు కాలేజ్ లవ్ స్టోరీస్ ట్రెండ్ కావడంతో వేణుకు ఇంకా బాగా కలిసొచ్చింది. అలా ముదురు స్టూడెంట్‌గా దిల్ సినిమాలో వేణు పాత్ర పంచిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు.

ఓ వైపు ఈ తరహా పాత్రలతోనే సునిల్ దూసుకుపోతున్నా.. అతనికి ఏ మాత్రం తీసిపోకుండా తనూ దూకుడు చూపించాడు. అప్పటి వరకూ కాలేజ్ స్టూడెంట్ గా ఆకట్టుకున్న వేణు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన సింహాద్రి సినిమాలో చేసిన పాత్ర చిన్నదే అయినా దాని ఇంపాక్ట్ ఇప్పటికీ కనిపిస్తుంది. ఆ పాత్ర తర్వాత రాజమౌళి సై సినిమాలో ఒక్క సీన్ కోసం పిలిచారు. ఆ సీన్ లో వేణు టాలెంట్ చూసి క్యారెక్టర్ ను చాలా పొడిగించారు. నల్లబాలు.. నల్ల తాచు లెక్క అంటూ సై సినిమాలో వేణు ఇరగదీశాడనే చెప్పాలి.

Also watch :

Next Story

RELATED STORIES