వేణుమాధవ్‌కు టీడీపీ ఆఫీస్‌లో ఉద్యోగం ఎలా వచ్చిందంటే..

వేణుమాధవ్‌కు టీడీపీ ఆఫీస్‌లో ఉద్యోగం ఎలా వచ్చిందంటే..

వేణుమాధవ్ పుట్టింది పెరిగింది అప్పటి నల్గొండ జిల్లా కోదాడలో. అక్కడే డిగ్రీ వరకూ చదువుకున్నాడు. చిన్నతనం నుంచే మిమిక్రీ చేసేవాడు. స్టార్ హీరోలను అనుకరిస్తూ వారిలా డ్యాన్సులు కూడా చేసేవాడు. అలాగే కోదడా ప్రాంతంలో మొట్ట మొదటి వెంట్రిలాక్విస్ట్ గానూ అతనికి పేరుంది. అలా అనుకోకుండా అబ్బిన ఆ కళే అతన్ని కళారంగంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకుంది. ఆ కళతోనే ఎన్టీఆర్‌తో అనుబంధం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఉద్యోగం వచ్చేలా చేసింది.

ఎన్టీఆర్ ఆదేశంతో మకాం హైదరాబాద్ కు మారింది. ఇక్కడ కూడా కొన్ని బయటి ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉండేవాడు. ఓ సారి రవీంద్ర భారతిలో చేసిన మిమిక్రీ ప్రోగ్రామ్ ను ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి చూశారు. తర్వాత వేణు మాధవ్ కు పెద్దగా ఇష్టం లేకపోయినా అతనితో సంప్రదాయం సినిమాలో చిన్న వేషం వేయించారు. అతన్లో స్పార్క్ ఉండటం వల్ల చిన్న వేషమైనా ఆకట్టుకుంది. 1996లో సంప్రదాయం సినిమాతో అడుగుపెట్టిన వేణుకు అవకాశాలు వెంటనే రావడం విశేషం. గోకులంలో సీత, మాస్టర్, సుస్వాగతం సినిమాల్లో కనిపించాడు. కానీ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో పరిశ్రమలో తన ప్లేస్ ను పర్మనెంట్ చేసుకున్నాడు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story