సినిమాల్లోకి రాకముందు వేణు మాదవ్..

సినిమాల్లోకి రాకముందు వేణు మాదవ్..

1969 డిసెంబర్ 30న తెలంగాణలోని కోదాడలో జన్మించిన వేణు మాధవ్.. నాలుగో ఏట నుంచే మిమిక్రీ చేస్తూ అందర్నీ ఆకర్షించేవాడు. మిమిక్రీ చేస్తూనే అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితుడయ్యాడు. పార్టీ ఆఫీసులో ఆఫీస్ బాయ్‌గా పనిచేసేవాడు. సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిస్తున్న సంప్రదాయం చిత్రంలో కమెడియన్‌గా అవకాశం వచ్చింది. ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత వరుసగా వచ్చిన యువకుడు, దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి, మాస్ చిత్రాల్లో కమెడియన్‌గా వేణు మంచి హాస్యాన్ని పండించాడు. 2006లో వెంకటేష్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా వేణుమాధవ్ నంది పురస్కారం అందుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన హంగామా చిత్రంలో హీరోగా చేశాడు. ఆ తరువాత భూకైలాస్, ప్రేమాభిషేకం చిత్రాల్లో హీరోగా చేశాడు. మొత్తం 600కు పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాడు.

Tags

Read MoreRead Less
Next Story