ఆసుపత్రిలో వింత.. దానంతట అదే కదిలి వెళ్ళిపోయిన వీల్ చైర్.. (వీడియో)

ఆసుపత్రిలో వింత.. దానంతట అదే కదిలి వెళ్ళిపోయిన వీల్ చైర్.. (వీడియో)
X

వీల్ చైర్ దానంతట అదే కదిలిపోయిన ఘటన చంఢీఘర్‌లో చోటుచేసుకుంది. ఈనెల 19న పీజీఐ ఆస్పత్రిలో ఎవరి ప్రమేయం లేకుండానే వీల్ చైర్ ఒకటి మొదట వెనక్కి కదిలి ఆ తరువాత నేరుగా ఆసుపత్రి బయటకు వెళ్ళిపోయింది. దాంతో ఈ పరిణామాన్ని గమనించిన గార్డ్ ఆశ్చర్యంతో.. ఒకింత భయంతో నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. గాలికి ఆ వీల్ చైర్ కదిలింది ఏమో అనుకున్నా.. అదే సమయంలో పక్కనే ఉన్న ఇతర చైర్ లు ఏమాత్రం కదల్లేదు. దాంతో వారు భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ఆసుపత్రిలో దెయ్యం తిరుగుతుందని ప్రచారం చేసేసరికి రోగులు భయంతో వణికిపోతోన్నారు. గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో మార్చురీ వద్ద స్ట్రెచర్‌ కూడా ఇలానే ఎవరి ప్రమేయం లేకుండానే కదిలి ముందుకు వెళ్లినట్టు చర్చించుకుంటున్నారు.

Next Story

RELATED STORIES