తాజా వార్తలు

మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపీ డీఎస్‌

మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎంపీ డీఎస్‌
X

కొంతకాలంగా టీఆర్‌ఎస్‌తో అంటీ ముట్టనట్లు ఉంటున్న రాజ్యసభ సభ్యుడు డీఎస్‌.. మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అమిత్‌షాను కలిసిన అంశంపై వివరణ ఇచ్చిన డీఎస్‌.. హోం మంత్రి అయినందువల్లే ఆయనతో భేటీ అయ్యానని.. బీజేపీ ఆఫీస్‌లో ఆయన్ను కలవలేదని చెప్పారు. తన కుమారుడు అర్వింద్‌ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచాడని.. ఆయన సిద్ధాంతాలు ఆయనకున్నాయని చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు తనపై చర్య తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పాలనపై స్పందించేందుకు నిరాకరించిన డీఎస్‌.. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని చెప్పారు.

Also watch :

Next Story

RELATED STORIES