స్టూడెంట్‌ని మందలించిన లెక్చరర్ మిస్సింగ్!

X
TV5 Telugu26 Sep 2019 1:44 PM GMT
గుంటూరు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జానియర్ కాలేజీలో లెక్చరర్ అదృశ్యం కలకలం రేపుతోంది. కాలేజీలో విద్యార్థిని మందలించే క్రమంలో లెక్చరర్ సాంబశివరావు చేయి చేసుకున్నాడు. దీంతో లెక్చరర్‌పై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చివరకు పోలీసులు.. విద్యార్థి-లెక్చరర్ మధ్య రాజీ కుదుర్చారు. అయితే బుధవారం సాంబశివరావుపై విద్యార్థి తల్లిదండ్రులు బెదిరింపులు, దౌర్జన్యానికి దిగారు. దీంతో మనస్తాపానికి గురైన సాంబశివరావు.. బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. దీంతో లెక్చరర్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయన దూకినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also watch :
Next Story