క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం ఓ పోలీస్ ఆఫీసర్..

క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం ఓ పోలీస్ ఆఫీసర్..
X

ఖాకీ దుస్తుల వెనుక కాఠిన్యం ఉన్నా.. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ తీసుకున్న చిన్నారులు జుట్టును కోల్పోవడం ఆమెను కలచివేసింది. ఆమెకి ఉన్న పొడవాటి జుట్టుని అలాంటి పిల్లలకు విగ్గులు తయారు చేయించేందుకు ఇచ్చేసింది. కేరళకు చెందిన సీనియర్ మహిళా పోలీస్ అధికారి అపర్ణ లవకుమార్ క్యాన్సర్ అవేర్‌నెస్ డ్రైవ్‌లో భాగంగా స్థానిక పాఠశాలలో చదువుతున్న ఓ పదేళ్ల చిన్నారిని కలిసారు. క్యాన్సర్ కారణంగా ఆ పాపకు జుట్టు ఊడిపోవడాన్ని గుర్తించారు. తోటి స్నేహితుల నుంచి ఆమెకు ఎదురువుతున్న హేళనను తెలుసుకున్నారు. అప్పుడే అనుకున్నారు తన జుట్టుని అలాంటి పిల్లల కోసం ఇచ్చేయాలని. అయితే పోలీసులు జుట్టును ఇచ్చేయాలంటే తన సీనియర్ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో కేరళ పోలీసు అధికారులకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా పాటించాలి. మహిళలు గుండు చేయించుకోకూడదు. దీంతో ఆమె అధికారుల అనుమతి తీసుకుని గుండు కొట్టించుకున్నారు.

ఇంతకు ముందు కూడా ఓ సారి స్టేషన్‌లో పనిచేసి ఇద్దరు బిడ్డల తల్లి క్యాన్సర్ బారిన పడినప్పుడు తన పొడవైన జుట్టుని కొంత కత్తిరించి ఇచ్చారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా గుండు చేయించుకుని జుట్టు మొత్తం క్యాన్సర్ పేషెంట్ల కోసం ఇచ్చేశారు. జుట్టు లేక మానసికంగ కృంగి పోతున్న చిన్నారులకు సాయపడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని అపర్ణ చెబుతున్నారు. ఆమెకు జుట్టు కటింగ్ చేసిన పార్లర్‌కి చెందిన ఓనర్ ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. 2008లో ఓ సారి ఆసుపత్రి బిల్లు కట్టలేని బాధితునికి తన బంగారు గాజులను విరాళంగా ఇచ్చి అపర్ణ తన సహృదయాన్ని చాటుకున్నారు.

Also watch :

Next Story

RELATED STORIES