సైరా విషయంలో సురేందర్ రెడ్డి ఫెయిల్ అయ్యారా?

సైరా విషయంలో సురేందర్ రెడ్డి ఫెయిల్ అయ్యారా?

కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని దర్శకుడుని అంటారు. మరి ఆ కెప్టెన్ కరెక్ట్ గా లేకపోతే షిప్ మునిగిపోయినట్టే.. సినిమా కూడా మునిగిపోతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సైరా విషయంలో కెప్టెన్/ దర్శకుడు సురేందర్ రెడ్డి వల్లే సినిమాకు ఏ మాత్రం బజ్ రాలేదనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయం సినిమాకు సంబంధించి కీలకంగా వ్యవహరించిన వ్యక్తులే చెబుతున్నారు. సురేందర్ రెడ్డికి సరైన విజన్ లేకపోవడం వల్లే సైరా అనుకున్న స్థాయిలో రాలేదంటున్నారు. దర్శకుడుగా అతను చాలా వరకూ ఫెయిల్ అయ్యాడంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ పైనా సరైన అవగాహన లేని దర్శకుడు అతను అంటున్నారు. ఆ కారణంగానే ఎంతో ఎఫెక్టివ్ గా రావాల్సిన సినిమా కాస్తా ఇలా అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ రావడం కూడా అతని అసమర్థత వల్లే అంటున్నారు. ఈ విషయంలో నెలకొన్న గందరగోళంలోనూ అతనికి మినిమం క్లారిటీ లేకుండా పోయిందంటున్నారు.

సైరా నుంచి విడుదలైన రెండు ట్రైలర్స్ కూ పెద్దగా బజ్ రాకపోవడానికి కారణం కూడా సురేందర్ రెడ్డి అసమర్థతే అంటున్నారు. కమర్షియల్ సినిమాలు తీస్తున్నప్పుడు కొన్ని విషయాలు వదిలేయొచ్చు.. కానీ ఇలాంటి హిస్టారికల్ సినిమా తీసేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా అతను పాటించలేదట. అందువల్లే ఈ సినిమా ట్రైలర్ అనుకున్నంత ఇంపాక్ట్ చూపించలేకపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. చిరంజీవి లాంటి హీరో పిలిచి మరీ ఛాన్స్ ఇస్తే దాన్ని చేజేతులా పాడుచేసుకున్నాడు సురేందర్ అని సైరా క్రూ నుంచే వినిపిస్తోంది. ఇటు ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రాపర్ ప్లానింగ్ లేదట. అలాగే అతను ఇచ్చే ఇంటర్వ్యూస్ లో కూడా చాలా అనాసక్తంగా.. ఈ సినిమాతో తనకు పెద్దగా పనేం లేదనే నిర్లక్ష్యం కనిపిస్తుందనే కౌంటర్స్ వస్తున్నాయి. ఏదేమైనా సురేందర్ రెడ్డికి వచ్చిన ఈ భారీ అవకాశాన్ని చేజేతులా పాడు చేసుకుని దర్శకుడుగా తన అసమర్థత చూపించాడంటున్నారు. మరి ఈ వ్యవహారంపై మెగా టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story