దయచేసి మీరిద్దరూ రాజకీయాల్లోకి రావద్దు.. చిరంజీవి రిక్వెస్ట్

దయచేసి మీరిద్దరూ రాజకీయాల్లోకి రావద్దు.. చిరంజీవి రిక్వెస్ట్
X

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే మేల్కొంటే మంచిది అని అనుభవపూర్వకంగా చెబుతున్నారు. సహ నటులు, మిత్రులు అయిన కమల్ హాసన్, రజనీ కాంత్‌ల గురించి మాట్లాడుతూ వారిద్దరూ రాజకీయాల్లోకి రాకపోతేనే మంచిదని చిరంజీవి అన్నారు. 'ఆనంద వికటన్' అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. అగ్రహీరోలుగా వెలుగొందుతూ అందరి అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. దయచేసి నటులుగానే మీ జీవితాన్ని కొనసాగించండి. రాజకీయాలు అనే ఊబిలోకి దిగకండి. పాలిటిక్స్ అన్నీ పైసల్‌తోనే నడుస్తాయి. అంతా డబ్బు మయం. ప్రజలకు నిజాయితీగా ఏదో చేయాలని వస్తాము. కానీ మనం అనుకున్నట్లు ఉండదు అక్కడ.

నేను రాజకీయాల్లోకి వచ్చి నా సొంత నియోజక వర్గంలోనే ఓడిపోయాను. అదే ఇప్పడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి కూడా జరిగింది. ప్రత్యర్థులు కోట్లు కుమ్మరించి గెలుస్తారు. అని తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు చిరంజీవి. సౌమ్యంగా ఉండే వ్యక్తులకు రాజకీయాల్లో చోటు లేదని ఆయన అన్నారు. అయితే ఓటమిని ఎదుర్కుంటూ, ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా నిలదొక్కుకునే ధైర్యం, సత్తా ఉంటే రాజకీయాల్లోకి రావొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కానీ పరిస్థితులు ఏదో ఒక రోజు మీరు మారేలా చేస్తాయని అన్నారు.

Next Story

RELATED STORIES