తాజా వార్తలు

మహిళ కోసం శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండ్‌

మహిళ కోసం శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండ్‌
X

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో దుబాయ్ నుంచి మనీలా వెళ్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది నెలల గర్భవతి అయిన బేబీ జీన్‌ అనే ఓ ప్రయాణికురాలకు సడెన్‌గా పురిటినొప్పులు మొదలయ్యాయి. తోటి ప్రయాణికులు విమాన సిబ్బందికి ఆమె పరిస్థితిని తెలియజేయడంతో.. విమానాన్ని శంషాబాద్ కు మళ్లించారు. అక్కడ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో బేబీ జీన్‌ను ఎయిర్‌పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.

Next Story

RELATED STORIES