పూరీ డైరక్షన్‌లో ఛార్మీ.. ఇద్దరూ కలిసి..

పూరీ డైరక్షన్‌లో ఛార్మీ.. ఇద్దరూ కలిసి..
X

డైరక్టర్ పూరీ జగన్నాథ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టారు. ఆ సంతోషంతో మరిన్ని సినిమాలు చేయడానికి సన్నద్ధమవుతోంది పూరీ ఛార్మీ టీమ్. వీరిద్దరూ కలిసి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ దర్శకుడిగా అందులో వుండే కష్ట సుఖాలు తెలిసిన పూరీ, తనలాంటి మరి కొందరి దర్శకులకు సహాయం చేయాలనుకుంటున్నారు. కేవలం ఒకటో రెండో సినిమాలు తీసి వివిధ కారణాల వల్ల సినిమాలు చేయలేకపోతున్న దర్శకులకు, అసిస్టెంట్ దర్శకులకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తానని అంటున్నారు.

పూరీ తన పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఛార్మీకి కూడా భాగస్వామ్యం ఉంది. ఇద్దరూ కలిసి 20 మంది దర్శకులకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు పూరీ కనెక్ట్స్ లెటర్ పాడ్‌పై ఓ నోట్ రాసి విడుదల చేశారు. ఎందరో సృజనాత్మకత ఉన్న దర్శకులు సినిమాలు తీయాలని కలలు కంటారు. కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించక వారు ముందడుగు వేయలేకపోతున్నారు. క్రియేటివిటీ ఉన్న అలాంటి దర్శకులకు పూరీ, ఛార్మీ ఆర్థిక సహాయాన్ని అందించి సినిమా పట్టాలెక్కడానికి కావలసిన సహాయ సహకారాలందిస్తారు. ఇక పూరీ డైరక్షన్‌లో వస్తున్న నెక్ట్స్ మూవీ విజయ్ దేవరకొండతో ఉండనున్నట్లు సమాచారం.

Next Story

RELATED STORIES