సినీ రచయిత, ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌పై చీటింగ్ కేసు

సినీ రచయిత, ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌పై చీటింగ్ కేసు
X

టాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత, ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా స్టోరీ విషయంలో జెమినీ గ్రూప్‌ సంస్థ మేనేజర్ ప్రసాద్‌.. ఆయనపై ఫిర్యాదు చేశారు. 2017లో సినిమా కథ ఇస్తానని తమవద్ద నుంచి రూ.13.50 లక్షలు తీసుకుని స్టోరీ ఇవ్వకుండా మోసం చేశారని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. జెమినీ సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు కోన వెంకట్‌పై 406, 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Also watch :

Next Story

RELATED STORIES