తాజా వార్తలు

చెట్టు మీద దెయ్యం.. భయపడుతున్న జనం.. వీడియో వైరల్..

చెట్టు మీద దెయ్యం.. భయపడుతున్న జనం.. వీడియో వైరల్..
X

దెయ్యం తమ ఊళ్లో దర్జాగా తిరిగేస్తుందని జనం భయపడిపోతున్నారు. గ్రామ దేవతను కూడా లెక్క చెయ్యకుండా పోచమ్మ గుడి దగ్గర్లోనే మకాం పెట్టేసిందంటున్నారు. నిర్మల్‌ జిల్లా మామడ మండలంలోని కమల్‌కోటలో ప్రజలంతా దెయ్యం భయంతో వణికిపోతున్నారు. పోచమ్మ గుడి దగ్గర చెట్ల పొదల్లో అది తిష్టవేసిందని చెబుతున్నారు. అటువైపు వెళ్లేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు. ఆ దెయ్యాన్ని కొందరు వీడియో కూడా తీశారంటూ చెబుతున్నారు. పెద్ద చెట్టుపై ఓ ఆకారం కదులుతున్నట్టు ఉన్న వీడియోను చూపించి అది దయ్యమే అంటున్నారు.

ఈ వీడియో చూస్తుంటేనే ఫేక్ అని తెలుస్తున్నా.. గ్రామస్థులు మాత్రం నిజమని నమ్ముతున్నారు. ఈ భూతప్రేతాల నుంచి తమను దేవుడే కాపాడాలంటూ పూజలు చేసేస్తున్నారు. 30 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ఓ ఆకారం చెట్టుపై ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది దెయ్యమేనని నమ్మించేందుకు అందుకు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్‌లో హర్రర్ మ్యూజిక్ కూడా జతచేశారు. ఎవడో జనాలను వెర్రోళ్లను చేసేందుకు సృష్టించిన ఈ వీడియో క్షణాల్లోనే ఊరంతా వైరల్ అయిపోయింది. అక్కడి నుంచి సోషల్ మీడియాలోనూ తెగ సర్క్యూలేట్ అవుతోంది. కాస్త వీడియోను పరిశీలనగా చూసిన వాళ్లు దెయ్యం లేదు గియ్యం లేదని లైట్ తీసుకున్నా.. పల్లెటూరు వాళ్లలో మాత్రం భయం తొలగిపోవడం లేదు.

Next Story

RELATED STORIES