భర్తపై అనుమానంతో సీక్రెట్ కెమెరా అమర్చిన భార్య.. సీన్ రివర్స్

భర్తపై అనుమానంతో సీక్రెట్ కెమెరా అమర్చిన భార్య.. సీన్ రివర్స్
X

సాఫీగా సాగుతున్న ఓ జంట జీవితంలో ఊహించని మలుపు ఎదురైంది. భర్తతో ఎంతో హాయిగా జీవించాలనుకున్న ఆ భార్య జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. భర్త పరాయిస్త్రీతో సంబంధం పెట్టుకోడాన్ని తట్టుకోలేని ఆ ఇల్లాలు విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. అయితే భర్తకు వేరే అమ్మాయితో సంబంధం ఉందనే విషయాన్ని ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచాలని భావించింది. ఈ నేపథ్యంలో భర్తకు తెలియకుండా వారి పడక గదిలో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేసింది. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు.. ఇప్పుడు ఆ ఇల్లాలి విషయంలో అదే జరిగింది. ఆమె ప్లాన్ బెడిసి కొట్టి కటకటాల పాలైంది.

పుణేకు చెందిన ఓ జంట మద్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2016 నుంచి ఆ జంట విడాకుల కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భర్త మరో యువతితో అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని ఆధారలతో సహా కోర్టు ముందు ఉంచితే.. విడాకులు త్వరగా వస్తాయని అనుకుంది. భర్తకు తెలియకుండా వారి పడక గదిలో రహస్య కెమెరాను అమర్చింది. ఈ విషయం తెలియని భర్త ఎప్పటిలాగే ప్రియురాలిని ఇంటికి తీసుకు వచ్చి.. రాసలీలలు సాగించాడు. సీసీ కెమెరాలో చిక్కిన ఆ దృశ్యాలని కోర్టు ముందు ఉంచింది భార్య. అయితే.. ఇక్కడే ఆమెకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ వీడియోలో ఉన్న భర్త ప్రియురాలు.. ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తన ప్రైవసీకి భంగం కలిగించారంటూ భార్య, ఆమె తరఫు న్యాయవాదిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ఇల్లాలిపై ఐపీసీ సెక్షన్ 354, 507, 120 కింద కేసులు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.

Also watch:

Next Story

RELATED STORIES