బీరు బాటిల్‌లో తల దూర్చిన పాము.. వీడియో

బీరు బాటిల్‌లో తల దూర్చిన పాము.. వీడియో

ఎక్కడ తిన్నవి అక్కడే పడేయడం.. అవి పర్యావరణానికి హాని కలిగిస్తాయని తెలిసినా ఉదాసీనంగా వ్యవహరించడం మనుషులకు పరిపాటి. అడవుల్లో తిరుగాడే జంతువులు కూడా ఈ కాలుష్యం బారిన పడి ఒక్కోసారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. తాజాగా ఒడిశాలోని మయూరభంజ్‌లోని అటవీ ప్రాంతంలో ఎవరో తిని, తాగి బీరు బాటిళ్లు అక్కడే వదిలేశారు. అటుగా తిరుగుతున్న నాగు పాము అక్కడే ఉన్న బీరు బాటిల్‌లో తల దూర్చింది. కానీ తల బయటకు రాక చాలా ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని ఫారెస్టు అధికారులు గుర్తించారు. వెంటనే మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో డబ్బాలో ఇరుకున్న పాము తలను బయటకు తీశారు. తరువాత పామును ఓ లోహపు కడ్డీ సాయంతో అడవిలోకి తీసుకెళ్లి పుట్ట దగ్గర వదిలిపెట్టారు. బయటకు వచ్చిన పాము బుసలు కొడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story