ప్రియాంకగాంధీకి షాకిచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదితి సింగ్‌

ప్రియాంకగాంధీకి షాకిచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అదితి సింగ్‌

సొంత పార్టీ ఎమ్మెల్యేనే కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీకి షాకిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా యూపీ సర్కార్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని విపక్షాలన్నీ మూకుమ్మడిగా బహిష్కరించాయి. మరోవైపు యూపీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రియాంక గాంధీ లక్నోలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రియాంక ర్యాలీ డుమ్మా కొట్టి మరీ MLA అదితి సింగ్‌ అసెంబ్లీకి హాజరయ్యారు.

అదితి సింగ్‌ రాయ్‌బరేలి MLA. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రాయ్‌బరేలీ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉంది. అదితి తండ్రి అఖిలేశ్‌ సింగ్‌ గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు. అదితి కూడా ప్రియాంక సన్నిహితురాలిగా ఇన్నాళ్లు కొనసాగారు. కానీ, అనూహ్యంగా ఆమె ప్రియాంక ర్యాలీకి గైర్హాజరై.. అసెంబ్లీకి వెళ్లి కాంగ్రెస్‌ వర్గాలకు షాకిచ్చారు.

అదితి త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని, ఈ క్రమంలో యోగి సర్కారు నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని సమాచారం. అయితే, తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు అదితి సింగ్‌.

Tags

Read MoreRead Less
Next Story